Wednesday, 11 April 2018

శ్రీ ఆంజనేయ స్తుతి

           

          
                        శ్రీ ఆంజనేయ స్తుతి






1.ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం |
  తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం | |

2.గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
  రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజమ్ ||

3.యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్
  తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
  బాష్పవారి పరిపూర్ణలోచనమ్
  మారుతిం నమత రాక్షసాంతకమ్ ||

4.బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా|
  అజాడ్యం వాక్పటుత్వం చ హనూమత్స్మరణాద్భవేత్‌||

                || ఓం శ్రీ ఆంజనేయ నమో నమః ||


శ్రీ ఆంజనేయ దండకము

           


                     శ్రీ ఆంజనేయం దండకము




శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు ||

సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్ ||

దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి ||

యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ ||

నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్త నల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్ ||

దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ ||

నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా ||

               || నమస్తే సదా బ్రహ్మచారీ ||

       || నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః ||

శ్రీ గోపాల కృష్ణ స్తోత్రము

                        


   శ్రీ గోపాల కృష్ణ స్తోత్రము





శ్రీ నారద ఉవాచ

ఓం నవీననీరదశ్యామం నీలేందీవరలోచనం |
వల్లవీనందనం వందే కృష్ణం గోపాలరూపిణమ్ || 1 ||

స్ఫురద్బర్హిదలోద్బద్ధ నీలకుంచిత మూర్ధజం |
కదంబకుసుమోద్బద్ధవనమాలావిభూషితమ్ || 2 ||

గండమండల సంసర్గిచలత్కుంచిత కుంతలం |
స్థూలముక్తాఫలోదారహారద్యోతితవక్షసమ్ || ౩ ||

హేమాంగదతులాకోటికిరీటోజ్జ్వల విగ్రహం |
మందమారుత సంక్షోభచలితాంబరసంచయమ్ || 4 ||

రుచిరోష్ఠపుటన్యసత వంశీ మధురనిస్స్వనైః |
లసద్గోపాలికాచేతో మోహయంతం పునః పునః || 5 ||

వల్లవీ వదనాంభోజ మధుపాన మధువ్రతం |
క్షోభయంతం మనస్తాసాం సస్మేరాపాంగవీక్షణైః || 6 ||

యౌవనోద్భిన్న దేహాభిస్సంసక్తాభిః పరస్పరమ్ |
విచిత్రాంబర భూషాభిర్గోపనారీభిరావృతమ్ || 7 ||

ప్రభిన్నాంజన కాళిందీజల కేళీకలోత్సుకం |
యోధయంతం క్వచిద్గోపాన్వ్యాహరంతం గవాంగణమ్ ||8||

కాళిందీ జలసంసర్గే శీతలానిల సేవితే |
కదంబపాదపచ్ఛాయే స్థితం బృందావనే క్వచిత్ || 9 ||

రత్న భూధరసం లగ్నరత్నాసన పరిగ్రహం |
కల్పపాదపమధ్యస్థహేమమండపికాగతమ్ || 10 ||

వసంత కుసుమామోద సురభీకృతదిఙ్ముఖే |
గోవర్ధనగిరౌ రమ్యే స్థితం రాసరసోత్సుకమ్ || 11 ||

సవ్య హస్తతలన్యస్త గిరివర్యాతపత్రకమ్ |
ఖండితాఖండలోన్ముక్తముక్తాసారఘనాఘనమ్ || 12 ||

వేణువాద్య మహోల్లాస కృత హుంకారనిస్స్వనైః |
సవత్సైరున్ముఖైః శశ్వద్గోకులైరభివీక్షితమ్ || 13 ||

కృష్ణమేవాను గాయద్భిస్తచ్చేష్టావ శవర్తిభిః |
దండపాశోద్ధృతకరైర్గోపాలైరుపశోభితమ్ || 14 ||

నారదా ద్యైర్మునిశ్రేష్ఠైర్వేద వేదాంగపారగైః |
ప్రీతిసుస్నిగ్ధయా వాచా స్తూయమానం పరాత్పరమ్ || 15 ||

య ఏవం చింతయేద్దేవం భక్త్యా సంస్తౌతి మానవః |
త్రిసంధ్యం తస్య తుష్టోఽసౌ దదాతి వరమీప్సితమ్ || 16 ||

రాజవల్లభ తామేతి భవేత్సర్వజనప్రియః |
అచలాం శ్రియమాప్నోతి స వాగ్మీ జాయతే ధ్రువమ్ || 17 ||

Tuesday, 10 April 2018

శ్రీ హనుమాన్ అంగారక స్తుతి

                  

    శ్రీ హనుమాన్



శ్రీ హనుమాన్ వాల (తోక )ధ్యానం

శ్రీ హనుమాన్ వాలంలో  లక్ష్మీదేవి ఉంటుందట

వామే కారే వైరిభిదం వహంతం శూలం పారే శ్రుమ్ఖలం హార టంకం |
దాదాన మచ్చాచ్య సువర్ణ వర్ణం భజే జ్వలత్కుమ్దల మామ్జనేయం ||
పద్మ రాగ మణి కుండల త్విషా పాటలీ కృత కపోల మండలం |
దివ్య హేమ కదళీ వనామ్తరే భావ యామి పవ మాన నందనం ||
మండలీ కృత వాలాగ్రం స్వర్ణ వర్ణం మహా హనుం |
కుమ్దలాలంక్రుతం శూరం భజే వాయు సుతం హృది ||

            శ్రీ హనుమత్ అంగారక స్తుతి

మహేశ్వర స్యానస స్యూత బిందుం –భూమౌజతం రక్త మాల్యామ్బరాధ్యం |
సువర్చాసం లోహితాంగం కుమారం –కుజం సదాహం శరణం ప్రపద్యే ||

           సాష్టాంగా నమస్కార స్త్రోత్రం



రామ దూత నమస్తుభ్యం సీతా శోక వినాశక |
లక్ష్మణస్య ప్రాణ దాతా కూరు మద్వామ్చితం ఫలం ||
వాయు నందన సుగ్రీవ సచివ ఆర్ణవ లంఘన |
దుస్త రాక్షస దర్పఘ్న కూరు మద్వామ్చితం ఫలం ||
అంజనా గర్భ సంభూత లంకా ప్రాణ అపహారక |
రావనోద్యాన విధ్వంశిన్ కూరు మద్వామ్చితం ఫలం ||
ప్రసన్నో భవ మే స్వామిన్ ప్రపన్నార్తి ప్రభంజన |
త్వత్పాద సన్నిధిం ప్రాప్తం పాహిమాం కరుణాకర ||

Sunday, 8 April 2018

శ్రీ నటరాజ స్తోత్రము

                        
  శ్రీ నటరాజ స్తోత్రము




(పతంజలిముని కృతం)

సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం |
పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ ||
కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్ |
చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ ||

హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం |
విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ ||
పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం |
చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ ||

అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-తరంగ |
నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ ||
శివం దశదిగంతర విజృంభితకరం కరళసన్మృగశిశుం పశుపతిం |
హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ ||

అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం |
ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ ||
శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరమ్ |
సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ ||

అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలమ్ |
కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్ ||
అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరమ్ |
సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ ||

అచింత్యమళివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురుంబ ధవళమ్ |
ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ ||
అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిమ్ |
ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ ||

పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం |
మృడం కనక పింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ ||
అసంఘమనసం జలధి జన్మకరలం కవలయంత మతులం గుణనిధిమ్ |
సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ ||

అజం క్షితిరథం భుజంగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్ |
కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతం ||
ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం |
స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ ||

అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం|
జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ ||
ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం |
పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ ||

ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః |
సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ ||
సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం |
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ ||

Thursday, 5 April 2018

శ్రీ రుద్రం లఘున్యాసమ్


                
                                    శ్రీ రుద్రం లఘున్యాసమ్



ఓం అథాత్మానగ్‍మ్ శివాత్మానగ్ శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ||
శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకమ్ | 
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ||
నీలగ్రీవం శశాంకాంకం నాగ యఙ్ఞోప వీతినమ్ | 
వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ||
కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినమ్ |
జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ||
వృష స్కంధ సమారూఢమ్ ఉమా దేహార్థ ధారిణమ్ |
అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ||
దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతమ్ |
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువ-మక్షర-మవ్యయమ్ |
సర్వ వ్యాపిన-మీశానం రుద్రం వై విశ్వరూపిణమ్ |
ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేత్ ||
అథాతో రుద్ర స్నానార్చనాభిషేక విధిం వ్యా”క్ష్యాస్యామః | ఆదిత ఏవ తీర్థే స్నాత్వా ఉదేత్య శుచిః ప్రయతో బ్రహ్మచారీ శుక్లవాసా దేవాభిముఖః స్థిత్వా ఆత్మని దేవతాః స్థాపయేత్ ||
ప్రజననే బ్రహ్మా తిష్ఠతు | పాదయోర్-విష్ణుస్తిష్ఠతు | హస్తయోర్-హరస్తిష్ఠతు | బాహ్వోరింద్రస్తిష్టతు | జఠరే‌உఅగ్నిస్తిష్ఠతు | హృద’యే శివస్తిష్ఠతు | కంఠే వసవస్తిష్ఠంతు | వక్త్రే సరస్వతీ తిష్ఠతు | నాసికయోర్-వాయుస్తిష్ఠతు | నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతామ్ | కర్ణయోరశ్వినౌ తిష్టేతామ్ | లలాటే రుద్రాస్తిష్ఠంతు | మూర్థ్న్యాదిత్యాస్తిష్ఠంతు | శిరసి మహాదేవస్తిష్ఠతు | శిఖాయాం వామదేవాస్తిష్ఠతు | పృష్ఠే పినాకీ తిష్ఠతు | పురతః శూలీ తిష్ఠతు | పార్శ్యయోః శివాశంకరౌ తిష్ఠేతామ్ | సర్వతో వాయుస్తిష్ఠతు | తతో బహిః సర్వతో‌உగ్నిర్-జ్వాలామాలా-పరివృతస్తిష్ఠతు | సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్ఠంతు | మాగ్‍మ్ రక్షంతు |
గ్నిర్మే’ వాచి శ్రితః | వాగ్ధృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి |
వాయుర్మే” ప్రాణే శ్రితః | ప్రాణో హృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | సూర్యో’ మే చక్షుషి శ్రితః | చక్షుర్-హృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | ంద్రమా’ మే మన’సి శ్రితః | మనోహృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతంబ్రహ్మ’ణి | దిశో’ మే శ్రోత్రే” శ్రితాః | శ్రోత్రగ్ హృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | ఆపోమే రేతసి శ్రితాః | రేతో హృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | పృథివీ మే శరీ’రే శ్రితాః | శరీ’గ్ హృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | ధి స్పతయో’ మే లోమ’సు శ్రితాః | లోమా’ని హృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | ఇంద్రో’ మే బలే” శ్రితః | బగ్ హృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | ర్జన్యో’ మే మూర్ద్ని శ్రితః | మూర్ధా హృద’యే | హృద’యంమయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | ఈశా’నో మేన్యౌ శ్రితః | న్యుర్-హృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | త్మా మ’ త్మని’ శ్రితః | త్మా హృద’యే | హృద’యం మయి’ | మృతే” | మృతం బ్రహ్మ’ణి | పున’ర్మ త్మా పురాయు రాగా”త్ | పునః’ ప్రాణః పురాకూ’మాగా”త్ | వైశ్వారో శ్మిభి’ర్-వావృధానః | ంతస్తి’ష్ఠత్వమృత’స్య గోపాః ||
అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య, అఘోర ఋషిః, అనుష్టుప్ చందః, సంకర్షణ మూర్తి స్వరూపో యో‌உసావాదిత్యః పరమపురుషః స ఏష రుద్రో దేవతా | నమః శివాయేతి బీజమ్ | శివతరాయేతి శక్తిః | మహాదేవాయేతి కీలకమ్ | శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
ఓం అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః | దర్శపూర్ణ మాసాత్మనే తర్జనీభ్యాం నమః | చాతుర్-మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః | నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః | జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః | సర్వక్రత్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః ||
అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః | దర్శపూర్ణ మాసాత్మనే శిరసే స్వాహా | చాతుర్-మాస్యాత్మనే శిఖాయై వషట్ | నిరూఢ పశుబంధాత్మనే కవచాయ హుమ్ | జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ వౌషట్ | సర్వక్రత్వాత్మనే అస్త్రాయఫట్ | భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||
ధ్యానం%
ఆపాతాళ-నభఃస్థలాంత-భువన-బ్రహ్మాండ-మావిస్ఫురత్- 
జ్యోతిః స్ఫాటిక-లింగ-మౌళి-విలసత్-పూర్ణేందు-వాంతామృతైః |
అస్తోకాప్లుత-మేక-మీశ-మనిశం రుద్రాను-వాకాంజపన్ 
ధ్యాయే-దీప్సిత-సిద్ధయే ధ్రువపదం విప్రో‌உభిషించే-చ్చివమ్ ||
బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దాః కలిత-శశికలా-శ్చండ కోదండ హస్తాః |
త్ర్యక్షా రుద్రాక్షమాలాః ప్రకటితవిభవాః శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీరుద్రసూక్త-ప్రకటితవిభవా నః ప్రయచ్చంతు సౌఖ్యమ్ ||
ఓం ణానా”మ్ త్వా ణప’తిగ్‍మ్ హవామహే విం క’వీనాము’మశ్ర’వస్తమమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్ప ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీ సాద’నమ్ || మహాగణపతయే నమః ||
శం చ’ మే మయ’శ్చ మే ప్రియం చ’ మే‌உనుకామశ్చ’ మే కామ’శ్చ మే సౌమనశ్చ’ మే ద్రం చ’ మే శ్రేయ’శ్చ మే వస్య’శ్చ మేయశ’శ్చ మే భగ’శ్చ మే ద్రవి’ణం చ మే ంతా చ’ మే ర్తా చ’ మే క్షేమ’శ్చ మే ధృతి’శ్చ మే విశ్వం’ చ మే మహ’శ్చ మే ంవిచ్చ’ మే ఙ్ఞాత్రం’ చ మే సూశ్చ’ మే ప్రసూశ్చ’ మే సీరం’ చ మే యశ్చ’ మ తం చ’ మే‌உమృతం’ చ మే‌உయక్ష్మం మే‌உనా’మయచ్చ మే జీవాతు’శ్చ మే దీర్ఘాయుత్వం చ’ మే‌உనమిత్రం  మే‌உభ’యం చ మే సుగం చ’ మే శయ’నం చ మే సూషా చ’ మే సుదినం’ చ మే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||




శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము

సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించటం మంచిది. ఆదిశంకరులు వారు అందించిన అద్భు...